OTTPlay Awards 2025 | సినీ రంగంలో నేషనల్ అవార్డ్స్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌తో పాటు తాజాగా ఓటీటీ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇప్పటికే పలు సంస్థలు ఓటీటీ అవార్డుల పేరిటా నటులకి అవార్డులని అందిస్తున్నాయి. తాజాగా హిందుస్తాన్ టైమ్స్ గ్రూప్‌కి చెందిన ఓటీటీప్లే అవార్డ్స్ 2025 మూడవ ఎడిషన్ మార్చి 22న ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో అట్టహాసంగా జరిగింది. ఇందులో ఉత్తమ నటుడితో పాటు ఉత్తమ వెబ్ సిరీస్ అలాగే నేరుగా ఓటీటీలో విడుదలైన ఉత్తమ చిత్రాలకు నిర్వహాకులు అవార్డులను అందించారు. ఈ అవార్డులలో డెస్పాచ్‌లో నటనకు గాను మనోజ్ బాజ్‌పాయ్ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నాడు. ఇక ఎవరెవరు అవార్డులు అందుకున్నారు అనేది చూసుకుంటే..
ఓటీటీ చిత్రాలకు దక్కిన అవార్డులివే!
బెస్ట్ మూవీ: గర్ల్స్ విల్ బి గర్ల్స్
బెస్ట్ డైరెక్టర్ (సినిమా): ఇంతియాజ్ అలీ (అమర్ సింగ్ చంకీలా)
బెస్ట్ పాపులర్ యాక్టర్ : మనోజ్ బాజ్‌పాయ్ (డిస్పాచ్)
బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్): అనుపమ్ ఖేర్ (విజయ్69, ది సిగ్నేచర్)
బెస్ట్ పాపులర్ యాక్ట్రెస్ : కాజోల్ (దోపత్తి)
బెస్ట్ పాపులర్ యాక్ట్రెస్ (క్రిటిక్స్): పార్వతి తిరువొత్తు (మనోరథంగళ్)
బెస్ట్ విలన్ : సన్నీ కౌశల్ (ఫిర్ ఆయే హసీనా దిల్రుబా)
బెస్ట్ కమెడియన్ : ప్రియమణి (భామాకలాపం2)
బెస్ట్ యాక్టింగ్ టాలెంట్ : అవినాష్ తివారి (ది మెహతా బాయ్స్)
బెస్ట్ యాక్టింగ్ టాలెంట్ : షాలినీ పాండే (మహరాజ్)
వెబ్‌సిరీస్‌లకు దక్కిన అవార్డులివే!
బెస్ట్ వెబ్‌సిరీస్ : పంచాయత్3
బెస్ట్ డైరెక్టర్: నిఖిల్ అడ్వాణీ (ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్)
బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) : జైదీప్ అహ్లవత్ (పాతాళ్‌లోక్2)
బెస్ట్ పాపులర్ యాక్టర్ : రాఘవ్ జ్యుయెల్ (గయారా గయారా)
బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) : నిమేషా సజయన్ (పోచర్)
బెస్ట్ పాపులర్ యాక్టర్స్ : అదితి రావ్ హైదరి (హీరామండి)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: రాహుల్ భట్ (బ్లాక్ వారెంట్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ : జ్యోతిక (డబ్బా కార్టెల్)
బెస్ట్ కమెడియన్ : నీరజ్ మాధవ్ (లవ్ అండర్ కన్స్ట్రక్షన్)
బెస్ట్ యాక్టింగ్ టాలెంట్ : అభిషేక్ కుమార్ (తలైవేట్టయన్ పాళయం)
బెస్ట్ యాక్టింగ్ టాలెంట్ : పత్రలేఖ (IC 814)
స్పెషల్ అవార్డ్స్
ఉత్తమ టాక్ షో వ్యాఖ్యాత: రానా దగ్గుబాటి (ది రానా టాక్ షో)
ఉత్తమ రియాల్టీ షో: ది ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్
ఉత్తమ నాన్ స్క్రిప్ట్ షో: షార్క్ ట్యాంక్
ట్రయల్ బ్లేజర్ ఆఫ్ ది ఇయర్: శ్రీమురళి (బఘీర)