OTT| ప్రతి వారం కూడా థియేటర్, ఓటీటీలలో వైవిధ్యమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చి కనువిందు చేస్తూ ఉంటాయి. అయితే ముందుగా థియేటర్లో రిలీజ్ అయి సందడి చేయనున్న సినిమాల లిస్ట్ చూస్తే ముందుగా నాని నిర్మాతగా, రామ్ జగదీశ్ దర్శకత్వంలో రూపొందిన కోర్టు సినిమా మార్చి 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇందులో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక కిరణ్ అబ్బవరం, దర్శకుడు విశ్వకరుణ్ కాంబోలో వస్తున్న దిల్ రూబా మార్చి 14న రిలీజ్ కానుంది.
కున్‌చకో బొబన్, ప్రియమణి, జగదీశ్, విశాక్ నాయర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్ అబ్రహాం కీలక పాత్రలో శివమ్ నాయర్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా ఫిల్మ్ ది డిప్లొమాట్ కూడా మార్చి 14న రిలీజ్ కానుంది. ఇక కార్తీ హీరోగా రూపొందిన యుగానికి ఒక్కడు చిత్రం మార్చి 14న రీరిలీజ్ కానుంది. ఇక ఓటీటీ విషయానికి వస్తే.. నెట్‌ఫ్లిక్స్ లో పలు మూవీస్ స్ట్రీమింగ్కి సిద్ధం అయ్యాయి. అమెరికన్ మ్యాన్ హంట్ (డాక్యుమెంటరీ సిరీస్)- మార్చి 10, నుండి స్ట్రీమ్ కానుండగా, అమెజాన్ ప్రైమ్ లో వీల్ ఆఫ్ టైమ్ 3 వెబ్‌సిరీస్ – మార్చి 13 నుండి, బీ హ్యాపీ (హిందీ) – మార్చి 14 నుండి ఒరు జాతి జాతకమ్ అనే మలయాళ మూవీ మార్చి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది.
ఇక జీ5 లో ఇన్ గలియోంమే (హిందీ)- మార్చి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఆపిల్ టీవీ ప్లస్ లో డోప్‌థీప్ (వెబ్‌సిరీస్) – మార్చి 14 నుండి స్ట్రీమ్ కానుండగా, ఈటీవీ విన్ లో పరాక్రమం (తెలుగు) – మార్చి 13 నుండి, రామం రాఘవం (తెలుగు) – మార్చి 14 నుండి స్ట్రీమ్ కానుంది.