సెలబ్రిటీల పెళ్లి వేడుక అంటే అందరిలో అమితమైన ఆసక్తి ఉంటుంది. హీరో పెళ్ళి అయిన , హీరోయిన్ పెళ్లి అయిన జరుగుతుంది అంటే అభిమానులు చూపించే ఆసక్తి అంతా ఇంతా కాదు. హల్దీ వేడుకల నుండి పెళ్లి రోజు చివరి ఘట్టం వరకు ప్రతి విషయంపై ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఇక హీరో- హీరోయిన్ పెళ్లి చేసుకుంటున్నారు అంటే అభిమానులే కాదు మీడియా, ఇతర ప్రముఖులలోకూడా అమితమైన ఆసక్తి నెలకొని ఉంటుంది.
బాలీవుడ్ క్రేజీ కపుల్ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్‌ల వివాహం డిసెంబర్ 9న జైపూర్‌లో జరగనున్నట్టు తెలుస్తుండగా, వీరి పెళ్లికి పరిమిత సంఖ్యలో అతిథులని ఆహ్వానించారు. అంతేకాదు ఫోన్స్‌ని లోపలికి అనుమతించడం లేదని ఓ టాక్ నడుస్తుంది. ఇదే జరిగితే కత్రినా- విక్కీ కౌశల్ పెళ్లికి సంబంధించి ఫొటోలు, వీడియోలు ఒక్కటి కూడా బయటకు రావు. అయితే కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ వివాహాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ పోటీ పడుతోందని సమాచారం.
వివాహానికి సంబంధించిన వీడియోలను రికార్డు చేసి, వీలు కుదిరితే విక్కీ- కత్రినాలను ఇంటర్వ్యూ చేసి, అతిథుల అభిప్రాయాలను కూడా సేకరించి ఆ తర్వాత స్ట్రీమింగ్ చేసేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయనే టాక్ నడుస్తుంది. ఇందుకు ఏకంగా రూ. 100 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే విక్కీ కౌశల్- కత్రినా పెళ్లి రికార్డులకి ఎక్కడం ఖాయంగా కనిపిస్తుంది.