OTT Movies | గత వారం అఖండ 2 హంగామాతో చాలా చిత్రాలు వాయిదా పడ్డాయి. ఇక ఓటీటీలో మాత్రం మంచి చిత్రాలు ప్రేక్షకులని అలరించాయి. ఇక ప్రతి వారం లాగే, ఈ వారం కూడా థియేటర్లలో పలు ఇంట్రెస్టింగ్ చిత్రాలు ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమయ్యాడు. బాక్సాఫీస్ దగ్గర భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. హాలీవుడ్ విజువల్ వండర్ చిత్రం ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’ భారీ అంచనాల మధ్య డిసెంబర్ 19న విడుదలకి సిద్ధమైంది.. పలు ఇండియన్ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ అవుతుండటం, అవతార్ సిరీస్‌కి మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు
ఇక టాలీవుడ్ నుండి ‘గుర్రం పాపిరెడ్డి’, ‘సఃకుటుంబానాం’, ‘మిస్టీరియస్’ వంటి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.ఇక ఓటీటీలో కూడా ఈ వారం పలు ఇంట్రెస్టింగ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు కూడా సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి ఏయే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏయే సినిమాలు/వెబ్ సిరీస్‌లు సందడి చేయడానికి సిద్ధమయ్యోయో చూద్దాం.
ఈటీవీ విన్ :
రాజు వెడ్స్ రాంబాయి – డిసెంబర్ 18
నెట్‌ఫ్లిక్స్ :
ఎమిలీ ఇన్ పారిస్ 5 (వెబ్ సిరీస్ ) – డిసెంబర్ 18
ప్రేమంటే – డిసెంబర్ 19
రాత్ అఖేలీ హై 2 – డిసెంబర్ 19
అమెజాన్ ప్రైమ్ వీడియో :
థామా – డిసెంబర్ 16
ఎక్ దివానే కీ దివానియత్ – డిసెంబర్ 16
ఫాలౌట్ (వెబ్ సిరీస్) – డిసెంబర్ 17
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజన్ 4(వెబ్ సిరీస్) – డిసెంబర్ 19
జియో హాట్‌స్టార్ :
మిసెస్ దేశ్‌పాండే (వెబ్ సిరీస్) – డిసెంబర్ 19
జీ5 :
నయనం (తెలుగు వెబ్ సిరీస్) – డిసెంబర్ 19
డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ – డిసెంబర్ 19
సన్నెక్స్ట్ :
దివ్య దృష్టి – డిసెంబర్ 19