OTT Movies | ఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాలు హడావి లేకపోయినా, ఓటీటీలలో మాత్రం వినోద భరితమైన కంటెంట్ వరదలా రాబోతుంది. థియేటర్స్‌లో బాలకృష్ణ ‘అఖండ 2’ మాత్రమే విడుదల కానుండగా, దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోవైపు హిందీలో రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రిలీజ్ అవుతోంది. అయితే థియేటర్లతో పోలిస్తే ఓటీటీల్లో కంటెంట్ చాలా రిచ్‌గా, వైవిధ్యంగా ఉండటం విశేషం.ప్రత్యేకంగా తెలుగు స్ట్రెయిట్ సినిమాలు, డబ్బింగ్ మూవీస్, వెబ్ సిరీస్‌లు కలిసి డిసెంబర్ మొదటి వారాన్ని వినోదంతో నింపనున్నాయి.
రష్మిక మంద్రానా నటించిన ‘ది గార్ల్ ఫ్రెండ్ ( The Girlfriend)’, హారర్ థ్రిల్లర్ ‘థామా’ ఈ వారం డిజిటల్‌గా విడుదల అవుతుండటం ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది. ఇదే విధంగా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’, ‘డీయస్ ఈరే’, ‘స్టీఫెన్’ వంటి సినిమాలు, పలు ఇతర డబ్బింగ్ చిత్రాలు కూడా వరుసగా క్యూ కడుతున్నాయి. అయితే ఏ ఓటీటీలో ఏ తేదీన ఏ సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ అవుతున్నాయో ఒకసారి చూద్దాం:
నెట్‌ఫ్లిక్స్
ట్రోల్ 2 (నార్వేజియన్ సినిమా) – డిసెంబర్ 01
కిల్లింగ్ ఈవ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 02
మై సీక్రెట్ శాంటా (ఇంగ్లిష్ మూవీ) – డిసెంబర్ 03
ద గర్ల్‌ఫ్రెండ్ (తెలుగు మూవీ) – డిసెంబర్ 05
జే కెల్లీ (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబర్ 05
స్టీఫెన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – డిసెంబర్ 05
ద న్యూయార్కర్ అట్ 100 (ఇంగ్లిష్ మూవీ) – డిసెంబర్ 05
అమెజాన్ ప్రైమ్ వీడియో
థామా (తెలుగు డబ్బింగ్ సినిమా) – డిసెంబర్ 02
ఓ వాట్ ఫన్ (ఇంగ్లిష్ మూవీ) –డిసెంబర్ 03
ఆహా
ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 05
జియో హాట్‌స్టార్
ద బ్యాడ్ గాయ్స్ 2 (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబర్ 01
డీయస్ ఈరే (తెలుగు డబ్బింగ్ మూవీ) – డిసెంబర్ 05
జీ5
ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (తెలుగు సినిమా) – డిసెంబర్ 05
ఘర్వాలీ పెడ్వాలీ (హిందీ వెబ్ సిరీస్) – డిసెంబర్ 05
బే దునే తీన్ (మరాఠీ వెబ్ సిరీస్) – డిసెంబర్ 05
సోనీ లివ్
కుట్రమ్ పురిందవన్ (తమిళ వెబ్ సిరీస్) – డిసెంబర్ 05
సన్ నెక్స్ట్
అరసయ్యన ప్రేమ పసంగ (కన్నడ సినిమా) – డిసెంబర్ 05
ఆపిల్ టీవీ ప్లస్
ద హంట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 03
ద ఫస్ట్ స్నో ఆఫ్ ఫ్రాగల్ రాక్ (ఇంగ్లిష్ మూవీ) – డిసెంబర్ 05
బుక్ మై షో స్ట్రీమ్
ద లైఫ్ ఆఫ్ చక్ (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబర్ 04
ఈ వారం థియేటర్ల కంటే ఓటీటీలలోనే అసలైన వినోదం ఉండబోతోంది. విభిన్న భాషలు, విభిన్న జానర్లలో వస్తున్న ఈ కంటెంట్ ప్రేక్షకుల వీకెండ్‌ను ఎంటర్టైన్మెంట్తో నింపడం ఖాయంగా కనిపిస్తోంది.