OTT | ప్రతి వారం కూడా ప్రేక్షకులు ఓటీటీతో పాటు థియేటర్లో విడుదలయ్యే సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. గత నెల చివరిలో వచ్చిన ‘ఓజీ’, అలాగే ఈ నెల మొదట్లో రిలీజ్ అయిన ‘కాంతార చాప్టర్ 1’ చిత్రాలు మంచి విజయం సాధించి ప్రేక్షకులకి వినోదం పంచాయి. ఇప్పుడు ఈ వారంలో వినోదాలు పంచేందుకు ఏయే చిత్రాలు సిద్ధంగా ఉన్నాయనేది చూద్దాం. సాయికుమార్ , అనసూయ , వినోద్‌వర్మ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘అరి’ అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో రూపొందిన‘శశివదనే’ కూడా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో ఓ ఊపు ఊపేసిన వరుణ్ సందేశ్.. ఈ సారి ‘కానిస్టేబుల్’ మూవీతో వస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కానుంది.
జియో హాట్‌స్టార్..
మిరాయ్: అక్టోబర్ 10
సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ (సిరీస్): అక్టోబర్ 10
నెట్‌ఫ్లిక్స్
స్విమ్ టు మీ: అక్టోబర్ 10
ది విమెన్ ఇన్ క్యాబిన్ 10: అక్టోబర్ 10
కురుక్షేత్ర (యానిమేషన్ సిరీస్): అక్టోబర్ 10
వార్ 2: అక్టోబర్ 9 (సమాచారం మాత్రమే, అధికారిక ప్రకటనలేదు)
డా.సెస్సూస్ హార్టన్: అక్టోబర్ 6
ట్రూ హాంటింగ్: అక్టోబర్ 6
ఈజ్ ఇట్ కేక్ ? హాలోవీన్: అక్టోబర్ 8
ది రిసరెక్టెడ్: అక్టోబర్ 8
అమెజాన్ ప్రైమ్
మెయింటెనెన్స్ రిక్వైర్డ్: అక్టోబర్ 8
సన్నెక్స్ట్
త్రిబాణధారి బార్బరిక్: అక్టోబర్ 10
జీ 5
స్థల్: అక్టోబర్ 10
వెడువాన్: అక్టోబర్ 10
ఈ వారంలో సినిమా ప్రేమికులు థ్రిల్, హాస్యం, లవ్‌స్టోరీ, యాక్షన్ కలగలిపిన విభిన్న రకాల వినోదాన్ని ఆస్వాదించవచ్చు. మరి కొద్ది రోజులలో ఇంకొన్ని సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ కూడా రానున్నాయి.