OTT | ఈ వారం థియేటర్లలో భారీ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుండగా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రం చిన్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల సందడి కనిపించనుంది. ఈసారి నేరుగా విడుదలయ్యే తెలుగు చిత్రాలు పెద్దగా లేకపోయినా, మంచి టాక్ తెచ్చుకున్న పలు డబ్బింగ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్, డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ZEE5, సన్ నెక్స్ట్ తదితర ఓటీటీల్లో మొత్తం 18 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. మలయాళ స్టార్ టొవినో థామస్ నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘పల్లిచట్టంబి’ ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకుంది. ఇప్పుడు దాదాపు మూడు నెలల తర్వాత జూలై 24 నుంచి సోని లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
తెలుగులోకి ‘కాన్ సిటీ’
‘ఓజీ’ ఫేమ్ అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘కాన్ సిటీ’ కూడా ఈ వారం ఓటీటీలోకి అడుగుపెడుతోంది. హరీష్ దురైరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అన్నా బెన్ కథానాయికగా నటించగా, యోగిబాబు, రాధా రవి, తంబి రామయ్య కీలక పాత్రలు పోషించారు. జూలై 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తమిళంతో పాటు తెలుగు డబ్బింగ్లో కూడా స్ట్రీమింగ్ కానుంది.
విక్రాంత్ మస్సే ‘ముసాఫిర్ కేఫ్’
‘12th ఫెయిల్’ చిత్రంతో గుర్తింపు పొందిన విక్రాంత్ మస్సే నటించిన రొమాంటిక్ వెబ్‌సిరీస్ ‘ముసాఫిర్ కేఫ్’ కూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. రుచిర్ అరుణ్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో వేదిక పింటో, మహిమా మక్వానా, అదిల్ హుస్సేన్ తదితరులు నటించారు. జూలై 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో హిందీతో పాటు తెలుగు డబ్బింగ్లో కూడా వీక్షించవచ్చు.
నెట్‌ఫ్లిక్స్‌లో..
ఎలైట్ ఫోర్స్ (వెబ్‌సిరీస్) – జూలై 22
ఏ టాక్సిక్ లవ్ స్టోరీ (డాక్యుమెంటరీ) – జూలై 22
రాన్సమ్ కెన్యన్ సీజన్ 2 – జూలై 23
ద డెట్ కలెక్టర్ – జూలై 23
ద ట్రూతర్స్ – జూలై 24
ముసాఫిర్ కేఫ్ – జూలై 24
72 అవర్స్ – జూలై 24
లాస్ క్రెయంటస్ – జూలై 24
కాన్ సిటీ – జూలై 24
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
బ్లీచ్: థౌజండ్ ఇయర్ బ్లడ్ వార్ – జూలై 25
స్టువర్ట్ ఫెయిల్స్ టు సేవ్ యూనివర్స్ – జూలై 24
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఆదర్శ్ బాల్ విద్యాలయ – జూలై 24
సోని లివ్‌లో..
పల్లిచట్టంబి – జూలై 24
జీ5లో..
అగ్ ఆయ్ అహో ఆయ్ – జూలై 24
ప్రేమ్ షాట్స్ – జూలై 24
లయన్స్ గేట్ ప్లే..
ప్రొటెక్టర్ – జూలై 24
యాపిల్ టీవీ ప్లస్
ద డింక్ – జూలై 24
సన్ నెక్ట్స్
సీక్రెట్ ఆఫ్ కళింగ – జూలై 24
ఈ వారం థియేటర్ల కంటే ఓటీటీల్లోనే విభిన్న భాషల సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఎక్కువగా సందడి చేయనున్నాయి. ముఖ్యంగా ‘పల్లిచట్టంబి’, ‘కాన్ సిటీ’, ‘ముసాఫిర్ కేఫ్’ వంటి తెలుగు డబ్బింగ్ కంటెంట్‌పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.