Ori Devuda Movie | ఓటీటీలో ఓరి దేవుడా మూవీ అరుదైన రికార్డు..!
Ori Devuda Movie On OTT | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు ఈ ఏడాది బాగా కలిసివచ్చింది. గతేడాది ‘పాగల్’ వంటి డిజాస్టర్ తర్వాత ఈ ఏడాది ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ వంటి బ్లాక్‌బస్టర్‌తో విశ్వక్‌కు మంచి శుభారంభం దక్కింది.
Ori Devuda Movie On OTT | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు ఈ ఏడాది బాగా కలిసివచ్చింది. గతేడాది ‘పాగల్’ వంటి డిజాస్టర్ తర్వాత ఈ ఏడాది ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ వంటి బ్లాక్‌బస్టర్‌తో విశ్వక్‌కు మంచి శుభారంభం దక్కింది. అదే జోష్‌తో గతనెల ‘ఓరి దేవుడా’ సినిమాను రిలీజ్ చేశాడు. మొదటి రోజు నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను సాధించింది. ఈ మూవీ తమిళంలో సూపర్ హిట్టయిన ‘ఓమై కడువలే’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తూ రీమేక్ సినిమాను కూడా తెరకెక్కించాడు. వెంకటేష్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం ఇటీవలే ఆహాలో రిలీజైంది.
ఓరి దేవుడా మూవీ ఓటీటీలోనూ దూసుకుపోతుంది. తాజాగా ఈ చిత్రం ‘ఆహా’లో అరుదైన ఘనత సాధించింది. కేవలం 40 గంటల్లో 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్‌ను సొంతం చేసుకుని ఇంత వేగంగా ఈ ఘనత సాధించిన సినిమాగా ఆహాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. రోమ్-కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీవిపీ సినిమాస్, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. విశ్వక్‌కు జోడీగా మిథిలా పాల్కర్, ఆశా భట్లు ఈ చిత్రంలో నటించారు. పూరి జగన్నాధ్ గెస్ట్ రోల్ పోషించిన ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

