Operation Safed Sagar Teaser | 1999 కార్గిల్ యుద్ధంలో భారత వైమానిక దళం ప్రదర్శించిన అసమాన శౌర్య పరాక్రమాల నేపథ్యంలో తెరకెక్కిన హై-వోల్టేజ్ వార్ డ్రామా సిరీస్ ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఈ ప్రతిష్టాత్మక సిరీస్ యొక్క అధికారిక టీజర్‌ను తాజాగా విడుదల చేసింది.
ఈ సిరీస్‌లో సిద్దార్థ్, జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. పర్వత శిఖరాల నుంచి ఆకాశం వరకు సరికొత్త ఉత్సాహంతో దూసుకెళ్లేందుకు సిద్ధమైన ‘ది గోల్డెన్ యారోస్’ స్క్వాడ్రన్‌కు చెందిన యువ వీరుల అసాధారణ పోరాటాన్ని, వారి దేశభక్తిని ఈ సిరీస్‌లో కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా, అత్యంత భారీ నిర్మాణ విలువలతో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా సిరీస్ ఆగస్టు 7 నుంచి ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.