వెంకటేశ్ పెద్దపాలెం, అపర్ణ, మల్లిక్, హీనా సోని ముఖ్యతారలుగా రూపొందిన యాక్షన్ క్రైమ్ డ్రామా ‘వన్ బై ఫోర్’. ‘బాహుబలి’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన బాహుబలి పళని కె. ఈచిత్రానికి దర్శకుడు. రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ‘టంగ్ స్లిప్ అనే పాయింట్‌తో ఈ క్రైమ్ డ్రామా తీశాం.
సినిమాకు పనిచేసినవారంతా ప్రాణం పెట్టి పనిచేశారు. సాంకేతికంగా కూడా సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది.’ అని తెలిపారు హీరో వెంకటేశ్ పెద్దపాలెం. కథే ఈ టీమ్‌ని కలిపిందని, టెక్నికల్‌గా కూడా సినిమా అభినందనీయంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. అందర్నీ ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని నిర్మాతలు నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా అపర్ణ మల్లిక్, హీనా సోని, కొరియోగ్రాఫర్ సాగర్ వేలూరు కూడా మాట్లాడారు.