Om Shanthi Disco Shanthi | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని డైరెక్టర్ మహి వి రాఘవ్. యాత్ర, ఆనందో బ్రహ్మ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ డైరెక్టర్ సేవ్ ది టైగర్స్ సిరీస్‌తో మూవీ లవర్స్ ను ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. తాజాగా హార్రర్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మహి వి రాఘవ్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఓం శాంతి డిస్కో శాంతి. Already caution kiya.. Alreaddy..క్యాప్షన్‌తో వస్తోంది.
ఇప్పటివరకు దెయ్యాలు మనుషులను భయపెట్టాయి.. కానీ ఆ దెయ్యాలకే భయం పుట్టించే వాళ్లు ఎదురైతే..? అసలు భయం అంటే తెలియని పిచ్చివాళ్లు ఈ దెయ్యాల ముందుకొస్తే ఎలా ఉంటుంది. దెయ్యాలు వర్సెస్ పిచ్చివాళ్ల మధ్య జరిగే ఎలిమెంట్స్‌తో సాగే ఫన్ ఎంటర్టైనర్గా సినిమా ఉండబోతున్నట్టు మోషన్ పోస్టర్‌తో హింట్ ఇచ్చేశాడు. త్రీ ఆటమ్ లీవ్స్ షో రన్నర్ బ్యానర్‌పై శివ మేక, సాహితి చింతల పూడి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహి వి రాఘవ్ కథ, స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నాడు. కృష్ణకుమార్ సంగీతం సమకూరుస్తున్నాడు. రోహిణి, ముక్కు అవినాష్, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఇంతకీ దెయ్యాలు పిచ్చివాళ్లను భయపెట్టగలవా..? లేక పిచ్చివాళ్లే తిరగబడి దెయ్యాల్ని భయపెడతారా..? అనే సన్నివేశాలతో ఊహించని ట్విస్టులతో సాగనున్న సాగనున్నట్టు మేకర్స్ హింట్ ఇస్తున్నారు.
A genre-bending entertainer.
GHOSTS VS THE MADD.Non stop & Non sense comedy
Welcome to #OmShanthiDiscoShanthiAlready caution kiya.. alreaddy.. #OSDSonSep4th #OSDS@MahiVraghav #GoguRR @ShivaMeka @Sahiticpr @manoj4cinema #MukkuAvinash #Rohini #ShakalakaShankar… pic.twitter.com/cH5VVNFrjx
— BA Raju’s Team (@baraju_SuperHit) April 20, 2026
Valmiki Ramayana | ఆధ్యాత్మిక కలయిక.. ‘వాల్మీకి రామాయణం’ కోసం జతకట్టిన ఇళయరాజా!
Mahavatar Parshuraam | ధర్మ రక్షణ కోసం పరశురాముడి ఆగమనం.. ‘మహావతార్ పరశురామ్’ మోషన్ పోస్టర్ రిలీజ్