శేఖర్ మోడల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ, నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఒక్క అడుగు’. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. సినీప్రముఖులు వీఎన్ ఆదిత్య, అశోక్‌కుమార్, వి.సముద్ర, పద్మిని నాగులపల్లి, రామసత్యనారాయణ, సత్య మాస్టర్ ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరై.. చిత్ర టైటిల్‌ని, ఫస్ట్‌లుక్ పోస్టర్ని ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
నటుడు, దర్శక,నిర్మాత శేఖర్ మోడల్ మాట్లాడుతూ ‘నాకు నేనే అవకాశాన్ని కల్పించుకుంటూ ఈ ‘ఒక్క అడుగు’ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమా కోసం బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చాలా చేశాను. ఆడిషన్ చేసి టాలెంట్ ఉన్నవారిని మాత్రమే నటీనటులుగా తీసుకున్నాను. సాంకేతికంగా కూడా సినిమా ఆకట్టుకుంటుంది. నా ఈ తొలి ప్రయత్నాన్ని జనం ఆదరిస్తారని నమ్మకం ఉంది’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కెమెరా: సతీశ్ ముత్యాల, సంగీతం: సుభాష్ ఆనంద్, నిర్మాణం: సిరి క్రియేషన్స్.