Oka Pathakam Prakaram OTT | సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఒక పథకం ప్రకారం’ సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీలో దూసుకుపోతోంది. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం, జూన్ 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ రికార్డు వ్యూస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ ప్రధాన పాత్రలో, వినోద్ విజయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వినోద్ విజయన్ ఫిల్మ్స్ – విహారి సినిమా హౌస్ ప్రై.లి. బ్యానర్స్‌పై గార్లపాటి రమేష్‌తో కలిసి వినోద్ కుమార్ విజయన్ నిర్మించారు. ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఇంటర్వెల్ తర్వాత విలన్ ఎవరో చెబితే రూ. 10,000 ఇస్తామని యూనిట్ చేసిన ప్రకటనతో మంచి పబ్లిసిటీ పొందింది. ఈ ఛాలెంజ్‌లో 50 థియేటర్ల నుండి 50 మంది విజేతలకు రూ. 5 లక్షల బహుమతి అందించారు.
కథ విషయానికి వస్తే.. ‘ఒక పథకం ప్రకారం’ సినిమాలో సాయిరామ్ శంకర్ సిద్ధార్థ్ నీలకంఠ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్రలో నటించారు. విశాఖ నగరంలో జరిగిన వరుస హత్యల మీద పోలీసులు అతనిపై అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఈ హత్యలు సిద్ధార్థ్ చేశాడా? లేక దీని వెనుక వేరొకరు ఉన్నారా? అనేది సినిమాలోని ప్రధాన అంశం. ఈ చిత్రంతో సాయిరామ్ శంకర్ మంచి కమ్ బ్యాక్ ఇచ్చారని ఆడియన్స్ ప్రశంసిస్తున్నారు.
నిర్మాతలు గార్లపాటి రమేష్, వినోద్ విజయన్ మాట్లాడుతూ.. మంచి సినిమా తీస్తే ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా ఉంటుందని మరోసారి రుజువైంది. థియేటర్లలోనే కాకుండా, ఓటీటీలో కూడా ప్రశంసలు రావడం సంతోషంగా ఉంది. ఓటీటీ రిలీజ్ ప్లానింగ్, ప్రొసీజర్స్ విషయంలో మాకు సహాయం చేసిన సన్ నెక్స్ట్ కంటెంట్ హెడ్ శశి కిరణ్ నారాయణ గారికి చాలా ధన్యవాదాలు. ఈ సినిమా దర్శక నిర్మాణంలో నాకు అండగా నిలబడిన మా హీరో సాయిరామ్ శంకర్ గారితో పాటు చిత్ర బృందం అందరికీ ధన్యవాదాలు అని తెలియజేశారు.
శృతి సోధి, ఆషిమా నర్వాల్, సముద్రఖని, రవి పచ్చముత్తు, భానుశ్రీ, గార్లపాటి కల్పలత, పల్లవి గౌడ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి రాజీవ్ రాయ్ ఛాయాగ్రహణం అందించగా, రాహుల్ రాజ్ సంగీతం, గోపి సుందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. కార్తీక్ జోగేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
🎬 *#OkaPathakamPrakaram* is now streaming on @SunNXT!
Get ready for a gripping courtroom drama filled with suspense, mystery, and powerful performances.📆 *Streaming from:* June 27, 2025
📺 *Watch now, only on* @sunnxt
💥 *The film is receiving overwhelming appreciation… pic.twitter.com/MkNSXDf9ec— Vamsi Kaka (@vamsikaka) June 28, 2025