Oh My Dog On OTT | ‘బ్రూస్లీ’, ‘సాహో’ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి క్రేజ్ ఏర్పరచుకున్న తమిళ నటుడు అరుణ్‌విజయ్. తెలుగు డబ్బింగ్ వెర్షన్లో ఈయన సినిమాలకు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సాధించాయి. లేటెస్ట్గా ఈయన నటించిన చిత్రం ‘ఓ మై డాగ్’. సరోగ్ షణ్ముగం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అరుణ్ తండ్రి సీనియర్ నటుడు విజయ్‌కుమార్ ముఖ్య పాత్రలో నటించాడు. మహితా నంబియార్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం నేరుగా ఓటీటీ లోనే విడుదల కానుంది.
ఈ చిత్రంలో కుక్క కీలకపాత్రలో నటించింది. కుక్క చుట్టు ఈ సినిమా తిరుగుతుంది. ఈ చిత్రంలో అరుణ్ కొడుకు అర్ణవ్ విజయ్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్య, జోతిగా నిర్మించారు. కాగా ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్‌లో తమిళంతో పాటు తెలుగులో మార్చి 21నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో శుక్రవారం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూర్య తండ్రి శివకుమార్ మాట్లాడుతూ చదువులో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అయిన తన కొడుకు సూర్య నటుడిగా, నిర్మాతగా ఈస్థాయికి ఎదగడం గర్వంగా ఉందన్నారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ తన కొడుకు, మనవడితో కలిసి ఈ చిత్రంలో నటించడం మధురమైన అనుభవం అంటూ పేర్కొన్నాడు.దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రంలో నటనకు మాస్టర్ ఆర్ణవ్‌కు అవార్డు రావడం ఖాయమని తెలిపాడు.