‘ప్రతి ఒక్కరి సక్సెస్ఫుల్ లైఫ్‌లో తల్లి, భార్య ముఖ్య పాత్రలు పోషిస్తారు. వారి అనుబంధం తాలూకు భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ ఈ సినిమా అందరికి కనెక్ట్ అవుతుంది’ అన్నారు సుహాస్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’ ఈ నెల 11న విడుదలకానుంది. రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హరీష్ నల్ల నిర్మాత. బుధవారం జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హీరో మంచు మనోజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..
సుహాస్ తనకు సోదరుడిలాంటివాడని, యూట్యూబ్ నుంచి హీరోగా ఎదిగిన ఆయన ప్రయాణం ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఈ సినిమా తనకొక జీవితకాల జ్ఞాపకమని, ఇందులో అతిథి పాత్రల్ని పోషించిన దర్శకులు హరీశ్‌శంకర్, మారుతిలు ఎంతో సహకారం అందించారని దర్శకుడు రామ్ గోధల పేర్కొన్నారు. ఈ సినిమా కోసం ప్రతిభావంతులైన సాంకేతిక బృందం పనిచేశారని, సుహాస్ పర్ఫార్మెన్స్ మరోస్థాయిలో ఉంటుందని నిర్మాత హరీష్ నల్లా తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.