OG | ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ‘హరిహర వీరమల్లు’ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం వల్ల అభిమానుల్లో నిరాశ తలెత్తింది. అయితే, ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూసిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ’ (OG) ఆ అంచనాలను నెరవేర్చడంతో పాటు భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దసరా సీజన్లో థియేటర్లలో హల్చల్ సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో మిస్సయిన వారు ఇప్పుడే చూసేయండి.
కథ పరంగా జపాన్‌లో జరిగిన ఒక దాడి తర్వాత భారత్‌కు చేరిన ఓజీ గంభీర్ (పవన్ కళ్యాణ్), ముంబై అండర్వర్ల్డ్లో అడుగుపెట్టడం, అక్కడి మాఫియా ప్రపంచాన్ని ఎలా అదుపులోకి తీసుకుంటాడనేది ఆసక్తికరంగా చూపించారు. సత్యాదాదా (ప్రకాశ్ రాజ్) అనే డాన్‌కు అతను కుడిభుజంగా మారడం, అజ్ఞాతంలోకి వెళ్ళి మళ్లీ తిరిగి రావడం, తర్వాత ఏం జరుగుతుందో కథను మరింత రసవత్తరంగా చేస్తుంది.ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా మిళితంగా సుజీత్ తన ప్రత్యేక స్టైల్లో స్క్రీన్‌ప్లే రచించి ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేశాడు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ కాస్త ఆలస్యం అయినప్పటికీ, ప్రతి సీన్లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, క్లైమాక్స్‌లో వచ్చే ‘జానీ’ ట్విస్ట్ అభిమానులకి గూస్బంప్స్ తెప్పించింది. యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎలివేషన్ సీన్స్ పవర్ స్టార్ స్టైల్లో ఉన్నాయి.
ఫ్యామిలీ ఆడియెన్స్‌కి హింస కొంత ఎక్కువగా ఉన్నట్టు అనిపించినప్పటికీ, మాస్ ప్రేక్షకులకు ఇది ఫుల్ మాస్ ఎంటర్టైనర్. ప్రముఖ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మూవీ సుమారు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కగా, ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస కలిసి అందించారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్. ఎస్ థమన్ తన థండర్ బీట్లతో థియేటర్లను షేక్ చేశారు. ప్రతి సీన్లోనూ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ మేకింగ్ కనిపించింది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్‌తో పాటు బాలీవుడ్ నటులు ఇమ్రాన్ హష్మీ, జాకీ ష్రాఫ్, ప్రకాశ్ రాజ్, అజయ్ ఘోష్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటించారు. ప్రతి పాత్రకు వెయిట్ ఉండటం, పవన్ యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉండటంతో థియేటర్లు షేక్ అయ్యాయి.