OG | హరిహర వీరమల్లు చిత్రంతో నిరాశపరిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓజీ చిత్రంతో ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘ ఓజీ ’ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘అఖండ 2’ చిత్రం దసరాకి వస్తుందని ముందు ప్రచారం జరిగిన, అది రేసు నుంచి తప్పుకోవడంతో ‘ఓజీ’కి మరింత ప్లస్ కానుంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించారు.
పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రానున్న ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఎప్పుడో రావాల్సిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా కాస్త ఆలస్యమైంది. చివరికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 25న రిలీజ్‌కి సిద్ధమైంది. ఓవర్సీస్లో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించి స్టోరీ లైన్ ఒకటి బలంగా వినిపిస్తోంది. అదే నిజమైతే ‘ఓజీ’ బ్లాక్‌బస్టర్ కావడం ఖాయం అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.
సోషల్‌మీడియాలో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం … ముంబయి అండర్ వరల్డ్ నుండి పూర్తిగా మాయమైన ‘ఓజస్ గంభీర’ మళ్లీ తిరిగి రావడం, చీకటి ప్రపంచాన్ని శాసిస్తోన్న నిరంకుశ శత్రువైన ఓమి భావుని మట్టి కరిపించి తన సామ్రాజ్యాన్ని మళ్లీ ఎలా హస్తగతం చేసుకున్నాడన్నది చిత్ర కథగా తెలుస్తుంది. ఓజస్ గంభీర ప్రత్యర్థుల్ని ఎంత కిరాతకంగా హతమార్చాడు, నమ్మక ద్రోహానికి పాల్పడిన వారిని ఎలా శిక్షించాడు వంటి సీన్స్‌ని సుజీత్ చాలా అద్భుతంగా తెరకెక్కించాడట. పదేళ్లు కనిపించకుండా పోయిన ఓజస్ ఎక్కడికి వెళ్లాడు, ఏం చేశాడు అన్నది ఏ మాత్రం గెస్ చేయలేరట. కథ వినడానికి రొటీన్‌గానే ఉన్నా సుజీత్ టేకింగ్ సినిమాని మరో స్థాయికి తీసుకెళతాడని ముచ్చటించుకుంటున్నారు. వినాయక చవితి సందర్బంగా రిలీజ్ చేసిన ‘సువ్వి సువ్వి’ సాంగ్‌లో అయితే పవన్ లుక్ ఫ్యాన్స్‌కి తెగ నచ్చేసింది అని చెప్పాలి. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.