OG |రాజకీయాలతో బిజీగా ఉండడం వలన పవన్ కళ్యాణ్ ఈ మధ్య సినిమాలు చేయడం తగ్గించారు. అయితే కమిటైన క్రమంలో గతంలో మూడు సినిమాలు పూర్తి చేసే పనిలో పడ్డారు. కొద్ది రోజుల క్రితం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓజీ చిత్రం కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. హరిహర వీరమల్లు తర్వాత తన పూర్తి సమయాన్ని ఓజీ చిత్రానికి కేటాయించారు పవన్ . ఈ క్రమంలో చిత్ర షూటింగ్ తాజాగా పూర్తైందని మేకర్స్ తెలియజేశారు. గంభీర షూటింగ్ ను ముగించాడు.. ఇక ఓజీ రిలీజ్ కు రెడీ అవుతుంది అంటూ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇక ఓజీ షూటింగ్ ఫినిష్ కావడంతో మూవీ అనుకున్న టైంకి వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ 25 న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఆ డేట్‌కి రిలీజ్ చేసేలా పనులు శరవేగంగా జరుపుతున్నారు. కుర్ర డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రంలో పవన్ ను ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ గా చూపించనున్నాడు. చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తుండగా.. అర్జున్ దాస్ , శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ముంబైలో షూటింగ్ పాల్గొన్నటువంటి విజువల్స్ బయటకు వచ్చాయి. ఇందులో పవన్ కళ్యాణ్ ని చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ఓజీ’ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీరా అనే ముంబై అండర్ వరల్డ్ డాన్ పాత్రలో కనిపించనున్నారు. కథ ప్రకారం, ఓజస్ గంభీరా పదేళ్ల విరామం తర్వాత ముంబైకి తిరిగి వచ్చి, తన సామ్రాజ్యాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తాడని అర్ధమవుతుంది. చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఓజీ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఎట్టకేలకి ఈ మూవీని సక్సెస్ ఫుల్‌గా ఫినిష్ చేశాడు. ఇక త్వరలో భవదీయుడు భగత్ సింగ్ చిత్రంపై ఫోకస్ పెట్టనున్నాడు.