OG | బ్రో చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి సినిమా రాలేదు. ఆయన సినిమాల కోసం పవన్ ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. పవన్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న సందడి చేసేందుకు సిద్ధమైంది.రెండు సంవత్సరాల విరామం తర్వాత, పవన్ మళ్లీ వెండితెరపై సందడి చేయబోతున్నారు. ఇక ఇదిలా ఉంటే మరో బిగ్ అప్డేట్తో పవన్ టీమ్ ముందుకొచ్చింది. ఆయన నటిస్తున్న మరో భారీ చిత్రం ఓజీ షూటింగ్‌ను కూడా పూర్తి చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. “ఫైరింగ్ ఫినిష్డ్” అంటూ ఓ పోస్టర్‌తో ఈ విషయాన్ని వెల్లడించారు. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
ఇటీవలి కాలంలో ఈ సినిమా వాయిదాపై గాసిప్స్ వినిపించాయి. కానీ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వాటికి చెక్ పెడుతూ, సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందని మరోసారి స్పష్టత ఇచ్చింది. కొత్త పోస్టర్‌తో మరోసారి ఇదే తేదీని కన్ఫర్మ్ చేశారు.ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా, బాలీవుడ్ విలన్ ఇమ్రాన్ హష్మి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఆయనతో పాటు శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.‘ఓజీ’ చిత్ర కథ ముంబయి గ్యాంగ్‌స్టర్ నేపథ్యంతో సాగుతుంది. పవన్ ఇందులో గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్‌కు తోడు ఈ సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్, బ్రదర్-సిస్టర్ ఎమోషన్స్ కీలకంగా నిలవనున్నాయి. ఎమోషనల్ ట్రాక్ సినిమాకి ప్రధాన హైలైట్ కానుంది.
పవన్ కళ్యాణ్ కొద్ది గ్యాప్‌లోనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జూలై 24న హరిహర వీరమల్లు, సెప్టెంబర్ 25న ఓజీ విడుదల కాబోతుండటంతో, ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఇప్పటికే పవన్ ఎక్కడ పబ్లిక్ ఈవెంట్‌కి వెళ్లినా ఓజీ ఓజీ అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. దీనిని బట్టే ఓజీ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. ఈ రెండు సినిమాలు ఘన విజయం సాధిస్తే, పవన్ కెరీర్లో మరో మైలురాయిగా నిలవొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.