OG | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ OG పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమా మాస్, యాక్షన్ జానర్లో ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ వల్ల OG సినిమాకు అంతులేని క్రేజ్ ఉంది. ఈ హైప్‌ను బేస్ చేసుకుని ప్రీ-రిలీజ్ బిజినెస్ సుమారుగా ₹200 కోట్లు దాటినట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. అభిమానులు ఎక్కడైనా “OG OG” అంటూ చప్పట్లు కొడుతున్నారు. ఇదే మాట పవన్ కనిపించే ప్రతిసారీ రెపీట్ అవుతోంది.
‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం తన కెరీర్లో తొలిసారి భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసిన పవన్, OG కోసం అంతగా యాక్టివ్‌గా ఉండరని భావించారు అభిమానులు. అయితే తాజా సమాచారం ప్రకారం, OG ప్రమోషన్స్ కోసం పవన్ కళ్యాణ్ రెండు రోజుల డేట్స్ కేటాయించారని తెలుస్తోంది.సెప్టెంబర్ 18 తర్వాత ఈ ప్రమోషన్లు ప్రారంభమయ్యే అవకాశముంది.ఒక రోజు హైదరాబాద్‌లో మీడియా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఉంటాయి.మరో రోజు ఆంధ్రప్రదేశ్‌లో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారని సమాచారం.ఇప్పటికే రెండు పాటలు విడుదలైన OGకి పవన్ బర్త్‌డే సందర్భంగా ట్రైలర్ విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్.
ఈ అప్డేట్తో పవన్ అభిమానుల్లో ఆనందం నెలకొంది. ఇప్పటికే హైప్ ఉన్న OGకి పవన్ ప్రమోషనల్ యాక్టివిటీస్ జతకలిస్తే… బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం ఖాయం అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇక ఓజీ తర్వాత పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంతో పలకరించనున్నాడు. ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.