OG | పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ (They Call Him OG) మరోసారి మాస్ క్రేజ్‌తో వార్తల్లోకి వచ్చింది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, ‘ఫైర్ స్టార్మ్’ సాంగ్ పవర్ ఫుల్ రెస్పాన్స్ రాబట్టగా, ‘సువ్వి సువ్వి’ పాట మాత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీనితో ప్రమోషన్ల పైన కొంత గ్యాప్ తీసుకున్న మేకర్స్, ఇప్పుడు మళ్ళీ హైప్ పెంచే పనిలో పడిపోయారు. సినిమా ట్రైలర్ పై డైరెక్టర్ సుజీత్ పూర్తిగా ఫోకస్ పెట్టారని సినీ వర్గాల టాక్. ఇప్పటికే నాలుగు వేరియేషన్లు కట్ చేసినట్టు సమాచారం. అయితే చివరకు ఏ వెర్షన్‌ను ఫిక్స్ చేస్తారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అన్నీ రెండు నిమిషాల నిడివిలోనే ఉండనున్నాయి. సెప్టెంబర్ 18న ట్రైలర్ విడుదల చేస్తారని టాక్.
పవన్ కళ్యాణ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, తమన్ ఇచ్చిన పవర్ ఫుల్ బీజీఎం ఈ ట్రైలర్‌ను కొత్త లెవెల్‌కు తీసుకెళ్తాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ప్రమోషన్స్ ను వేగవంతం చేసిన మేకర్స్, సెప్టెంబర్ 15న ‘గన్స్ అండ్ రొసెస్’ అనే సాంగ్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ పాట మాస్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుందని బజ్. ఇక సెప్టెంబర్ 19న అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసి, 20న గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అమెరికాలో ఇప్పటికే OG అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కాగా, టికెట్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్‌కి ఉన్న పాన్-ఇండియా ఫాలోయింగ్ సినిమాకి క్రేజును రెట్టింపు చేస్తోంది. రిలీజింగ్ డే రోజున భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై DVV దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమాలో, ప్రియాంక మోహన్ హీరోయిన్గా, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. అలాగే శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, హరిష్ ఉత్తమన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరోసారి తన మాస్ మ్యూజిక్‌తో రెచ్చిపోనున్నాడు.