They Call Him OG | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ ‘ఓజీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. హరిహర వీరమల్లు ఇచ్చిన దెబ్బతో తీవ్ర నిరాశలో ఉన్న ఫ్యాన్స్ ఓజీపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే
ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 21న సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ‘ఓజీ’ కాన్సర్ట్‌ను నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ కార్యక్రమం ప్రధానంగా పాటల విడుదల వేడుకగా భావిస్తున్నారు. ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ హాజరవుతారా లేదా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే చిత్ర యూనిట్‌లోని మిగతా సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. పవన్ రాకపై క్లారిటీ వస్తే ఈ కాన్సర్ట్ మరింత గ్రాండ్‌గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే సినిమా నుంచి వరుసగా అప్డేట్లు వస్తున్నాయి. ముఖ్యంగా, పవన్ కల్యాణ్ స్వయంగా ఆలపించిన వాషీ పాట నిన్న విడుదలై అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ పాటతో పాటు, మరిన్ని అప్డేట్లు త్వరలోనే వస్తాయని చిత్ర యూనిట్ తెలిపింది.
Dear OG fandom 😎
⁰#OGConcert is LOCKED for tomorrow in Hyderabad 🔥🔥Let’s celebrate in the most electrifying way ever…Venue details dropping soon… stay tuned. #TheyCallHimOG #OG
— DVV Entertainment (@DVVMovies) September 20, 2025