OG Collections | పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ (OG)’ సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా విడుదలై, మొదటి రోజే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే టీజర్, ట్రైలర్లు, పాటలతో భారీ హైప్ క్రియేట్ చేయగా.. రిలీజ్ రోజున అభిమానుల నుంచి అద్భుత స్పందన అందుకుంది. ట్రేడ్ వర్గాల ప్రకారం, ‘ఓజీ’ వరల్డ్ వైడ్‌గా తొలిరోజే దాదాపు ₹150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇందులో ఇండియా వైడ్ షోస్ ద్వారా ₹65 కోట్లు, ఓవర్సీస్ ప్రీమియర్స్ ద్వారా ₹27 కోట్లు (3.65 మిలియన్ డాలర్లు) రాబట్టినట్లు సమాచారం. ఆంధ్ర ప్రదేశ్: ₹30.80 కోట్లు, తెలంగాణ: ₹26 కోట్లు, కర్ణాటక: ₹6.37 కోట్లు, తమిళనాడు: ₹1.20 కోట్లు, ఓవర్సీస్ (ప్రధానంగా నార్త్ అమెరికా): ₹24.85 కోట్లు, ఇతర దేశాలు: ₹7.55 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓజీ దుమ్ము లేపింది. తెలుగు రాష్ట్రాల్లో ‘ఓజీ’ సినిమా ఓపెనింగ్స్ అంచనాలను మించి ఉండడం విశేషం. నైజాం: ₹20.7 కోట్లు గ్రాస్ , ఉత్తరాంధ్ర: ₹6.70 కోట్లు, ఈస్ట్ గోదావరి: ₹5.30 కోట్లు, గుంటూరు: ₹6.35 కోట్లు, పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా: ₹20.25 కోట్లు షేర్, నెట్ కలెక్షన్లు (ఏపీ+TG): దాదాపు ₹70 కోట్ల వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది.భారతీయ సినిమా చరిత్రంలో ఓపెనింగ్ రోజు ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలలో ఓజీ కూడా ఒకటిగా నిలిచింది. పుష్ప2 : ది రైజ్ రూ.274 కోట్లతో టాప్ పొజీషన్లో ఉండగా, ఓజీ 7వ స్థానం దక్కించుకుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించగా, హీరోయిన్గా ప్రియాంక అరుల్ మోహన్ మెరిశారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, హరీష్ ఉత్తమన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య ₹250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో: ₹157 కోట్లు, కర్ణాటక + తమిళనాడు + కేరళ: ₹11 కోట్లు, నార్త్ అమెరికా: ₹25.5 కోట్లు, వర్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్: ₹193.5 కోట్లు, బ్రేక్ ఈవెన్ టార్గెట్ (షేర్): ₹200 కోట్లు, గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్: ₹400 కోట్లు. మొత్తంగా…పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ఈ సినిమా ఫెస్టివల్‌గా మారింది. ప్రీమియర్స్ నుంచే రికార్డులు సృష్టిస్తూ, దుమ్మురేపిన ‘ఓజీ’ తొలి రోజు కలెక్షన్లు టాలీవుడ్ హిస్టరీలోనే మరో మెరుపు అధ్యాయంగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ఈ జోరు వారం రోజులపాటు కొనసాగిస్తే… ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.