OG | పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ (OG) చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. 17 రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబడుతోంది. అయితే అన్ని ప్రాంతాల్లో హిట్ టాక్‌తో రన్ అవుతున్న ఈ మూవీ… కొన్ని చోట్ల మాత్రం అంత వసూళ్లని రాబట్టలేకపోయింది. ‘ఓజీ’ 17వ రోజు రూ.1.25 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 315 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. థియేట్రికల్ షేర్ సుమారుగా రూ.180 కోట్లు దాటినట్టు సమాచారం.
బిజినెస్ లెక్కలు చూస్తే..
ప్రీరిలీజ్ థియేట్రికల్ బిజినెస్ – ₹175 కోట్లు
నైజాం – ₹54 కోట్లు
సీడెడ్ – ₹22 కోట్లు
ఆంధ్ర (వేర్వేరు జిల్లాలు కలిపి) – ₹70 కోట్లకి పైగా
ఓవర్సీస్ – ₹17.5 కోట్లు
నాన్ థియేట్రికల్ (OTT + ఆడియో) – ₹99 కోట్లు (Netflix ₹81 కోట్లు, ఆడియో ₹18 కోట్లు)
దీంతో విడుదలకు ముందే ఈ సినిమా దాదాపు ₹272 కోట్ల బిజినెస్ చేసింది. బడ్జెట్ రూ.250 కోట్లు కాగా, నిర్మాత DVV దానయ్య ఈ సినిమాతో భారీ లాభాలు అందుకున్నట్టు టాక్. అయితే అన్ని మార్కెట్లలో బ్రేక్ఈవెన్ సాధించిన ఈ చిత్రం, నైజాంలో మంచి లాభాలు రాబట్టగా, ఓవర్సీస్లో కూడా ప్రాఫిట్లో ఉంది. అయితే ఆశ్చర్యకరంగా సీడెడ్ (రాయలసీమ)లో మాత్రం సినిమా బ్రేక్ ఈవెన్‌కు చేరలేదట. అక్కడ రూ.22 కోట్లకు బిజినెస్ జరిగినప్పటికీ, రూ.2-3 కోట్లు నష్టాల్లో ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఫ్యాన్స్‌ను కొద్దిగా నిరాశపరిచిన అంశంగా మారింది.సుజీత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా తెలుగులోకి పరిచయం అయ్యాడు. తమన్ అందించిన సంగీతం, సుజీత్ టేకింగ్, పవన్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు స్పెషల్ హైలైట్స్.
ఈ ఏడాది తెలుగులో విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ఓజీ’ నిలిచింది. సంక్రాంతికి వచ్చిన బడా చిత్రాలని కూడా ఈ మూవీ వసూళ్ల పరంగా అధిగమించింది. వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా ఓజీ బ్లాక్‌బస్టర్ . ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా రాయలసీమలో నష్టాలు చవి చూసిందనే వార్తలు అభిమానులకు చిన్న బాధను మిగిల్చాయి. అయినా, మొత్తం మీద పవన్ కళ్యాణ్ మాస్ క్రేజ్‌కి మరోసారి నిదర్శనంగా నిలిచిన సినిమా ‘ఓజీ’ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.