Suriya 46 Shoot begins | తమిళ నటుడు సూర్య తన కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించాడు. రెట్రో సినిమాతో ఇటీవల ప్రేక్షకులను అలరించిన సూర్య తన తదుపరి చిత్రం వెంకీ అట్లూరితో చేస్తున్న విషయం తెలిసిందే. ‘సూర్య 46 అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్ సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇటీవలే పళని మురుగన్‌ని దర్శించుకున్న ఈ చిత్రబృందం తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ని ప్రారంభించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఈ చిత్రంలో సూర్య సరసన మమితా బైజు కథానాయికగా నటిస్తున్నారు. అంతేకాకుండా, రవీనా టాండన్ మరియు రాధిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
The first step towards celebration, emotion and entertainment ❤️#Suriya46 shoot begins! @Suriya_offl #VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena @gvprakash @vamsi84 @NimishRavi @NavinNooli @Banglan16034849 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/WcBTgwA7LG
— Sithara Entertainments (@SitharaEnts) June 11, 2025