DCSuperman | హాలీవుడ్ నుంచి వచ్చి సూపర్ హిట్ అందుకున్న డీసీ స్టూడియోస్ మూవీ ‘సూపర్ మ్యాన్’ తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్స్టార్లో ఈ చిత్రం డిసెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ఎక్స్ వేదికగా ప్రకటించింది. జేమ్స్ గన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా డేవిడ్ కోరెన్స్వెట్ సూపర్ మ్యాన్ పాత్రను పోషించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. బొరేవియా(ఫిక్షనల్) అనే దేశం తన సైన్యంతో కలిసి జహ్రాన్పూర్ నగరంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ విధ్వంసాన్ని సూపర్మ్యాన్ (డేవిడ్ కోరెన్స్వెట్) తన శక్తితో అడ్డుకుంటాడు. అయితే శాస్త్రవేత అయిన విలన్ లెక్స్ లూథర్ (నికొలస్ హోల్ట్) తాను తయారు చేసిన ప్రత్యేక ఆయుధం ‘హ్యామర్ ఆఫ్ బొరేవియా’తో సూపర్మ్యాన్ నాశనం చేయాలని చూస్తాడు. దీనికోసం సూపర్మ్యాన్ వలన ప్రజలకు ఎప్పుడైనా ఆపద వస్తుందని, అతడిని అడ్డుకుని, అవసరమైతే అంతం చేయాలని లెక్స్ లూథర్ ప్రభుత్వ పెద్దలకు నమ్మబలికి ఒప్పిస్తాడు. ఈ కుట్రలో భాగంగా, సూపర్మ్యాన్ పుట్టుపూర్వోత్తరాలు అతను భూమ్మీదకు రావడానికి గల అసలు కారణాలను తెలుసుకుని, వాటితో కూడిన ఒక వీడియోను విడుదల చేస్తాడు. దీని ద్వారా ప్రజలు సూపర్మ్యాన్ను అసహ్యించుకునేలా, అపనమ్మకంతో చూసేలా చేస్తాడు. మరి ఈ దుష్ప్రచారాన్ని, లెక్స్ లూథర్ చర్యలను అడ్డుకుని… సూపర్మ్యాన్ తిరిగి తన విశ్వసనీయతను ప్రజలకు ఎలా నిరూపించుకున్నాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని ఎదుర్కొనే ప్రయత్నంలో, తన ప్రేమికురాలు లొయిస్ లేన్ (రేచెల్ బ్రోస్నాహన్), ఇతర సూపర్ హీరోస్ నుంచి అతడికి ఎలాంటి సాయం లభించింది? అనేది తెలియాలంటే సినిమాను తప్పక చూడాల్సిందే!
The #1 Superhero Sensation of 2025, DC Studios’ Superman, lands December 11 on JioHotstar (this time, with Krypto by his side)! pic.twitter.com/WS4uD7XNT4
— JioHotstar (@JioHotstar) November 26, 2025