సినిమాకొచ్చిన బజ్ చూస్తుంటే భయం వేస్తుంది
‘శివశక్తి పాత్ర, ‘ఓదెల 2’ సినిమా నా కెరీర్లో చాలా స్పెషల్. 20ఏళ్లుగా ఎన్నో ప్రొడక్షన్స్‌లో పనిచేశా. కానీ ఇంత పాషన్ వున్న ప్రొడ్యూసర్స్‌ని, క్రియేటర్స్ని చూడలేదు. ఇలాంటి టీమ్ అరుదుగా దొరుకుతుంది.
‘శివశక్తి పాత్ర, ‘ఓదెల 2’ సినిమా నా కెరీర్లో చాలా స్పెషల్. 20ఏళ్లుగా ఎన్నో ప్రొడక్షన్స్‌లో పనిచేశా. కానీ ఇంత పాషన్ వున్న ప్రొడ్యూసర్స్‌ని, క్రియేటర్స్ని చూడలేదు. ఇలాంటి టీమ్ అరుదుగా దొరుకుతుంది. ఈ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. 17వ తేదీ కోసం అందరితోపాటు నేను కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని తమన్నా అన్నారు.
ఆమె ప్రధాన పాత్రలో నటించిన సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల 2’. అశోక్‌తేజ దర్శకుడు. సంపత్‌నంది దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ.. డి.మధుతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 17న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో శర్వానంద్ అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు.
‘ఈ సినిమాకు వచ్చిన బజ్ చూస్తుంటే భయం వేస్తోంది. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కీ, రైటింగ్ డిపార్ట్‌మెంట్‌కీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ సినిమాకోసం ఓ రీసెర్చే జరిగింది. ఎన్నో పుస్తకాలను రిఫర్ చేశాం. డైరెక్టర్ అశోక్ వెరీ పాజిటీవ్ సోల్. అతనికి మంచి జరగాలనే ‘ఓదెల 2’ స్టార్ట్’ చేశా.
సౌందర్ రాజన్ విజువల్స్, అజనీష్ నేపథ్య సంగీతం ఈ సినిమాను హైలైట్స్. ఓ గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది’ అని సంపత్‌నంది తెలిపారు. ఇంకా నిర్మాత డి.మధు, దర్శకుడు అశోక్‌తేజ, నిర్మాత రాధామోహన్, నటుడు వశిష్ట ఎన్.సింహా, ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్లతోపాటు మరో అతిథి దర్శకుడు వశిష్ట కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

