హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : ఓదెల-2 చిత్రంలో కులం పేరుతో ఉన్న అభ్యంతరకర దృశ్యాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనర్‌తోపాటు ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారికి బీసీ కమిషన్ వేర్వేరుగా లేఖలు రాసింది. అత్తాపూర్ స్టేషన్లో ఫిర్యా దు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలిపింది.
ఈ వ్యవహారంలో దర్యాప్తు జరిపి ప్రొడ్యూసర్, డైరెక్టర్, రచయిత, నటులపై చర్యలు తీసుకోవాలని కోరింది. అభ్యంతరకర పదాలు ఉన్న చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని కమిషన్ తప్పు పట్టింది.