తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓ..సుకుమారి’. ఈ విలేజ్ డ్రామా ద్వారా భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గంగ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వర రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.
‘గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. యాదగిరిగా తిరువీర్ పక్కా మాస్ పాత్రలో కనిపిస్తాడు. రొమాన్స్, యాక్షన్, కామెడీ ప్రధానంగా ఆకట్టుకుంటుంది. తిరువీర్ గత చిత్రాల మాదిరిగానే విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కించాం’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సి.హెచ్.కుషేందర్, సంగీతం: భరత్ మంచిరాజు, నిర్మాత: మహేశ్వర రెడ్డి మూలి, దర్శకత్వం: భరత్ దర్శన్.