OMG Movie Teaser | టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ కమెడియన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చేది వెన్నెల కిషోర్. బ్రహ్మనందం తర్వాత ఆ స్థాయి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుని సినీ పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. తెరపై వెన్నెల కిషోర్ కనిపించాడంటే చాలు.. నవ్వు దానంతట అదే వస్తుంది. అంతలా తన కామెడితో చేరువయ్యాడు. లెక్కలేనన్ని సినిమాలు కేవలం వెన్నెల కిషోర్ కామెడీతో నిలబడ్డాయనడంలో అతిశయోక్తి లేదు. కేవలం కమెడియన్‌గానే కాకుండా ఈ మధ్య నెగెటీవ్ పాత్రలతోనూ మెప్పిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ నటుడు హీరో అవతారమెత్తిన విషయం తెలిసిందే. రీసెంట్గా చారి 111 అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. స్పై కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
అయితే ఈ సినిమా తర్వాత వెన్నెల కిషోర్ హీరోగా రెండో సినిమాను సెట్ చేసేశాడు. వెన్నెల కిషోర్, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో నందితా శ్వేతా హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం ఓఎమ్‌జీ(OMG). ఓ మంచి గోస్ట్ అనేది ట్యాగ్ లైన్. శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్ అబినికా ఇనాబతుని నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
పూర్వ జన్మ జ్ఞానంతో రెండో జన్మ ఎత్తే అవకాశం ఏ జీవికి కూడా ఉండదు.. దెయ్యాలకు మాత్రమే ఉంటుంది” అనే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. ఇక టీజర్ మొత్తం కథ రివీల్ చేయకుండా హార్రర్ కామెడీ ఎంటర్టైన్గా సాగుతుంది. వెన్నెల కిషోర్, షకలక శంకర్ దయ్యలతో చేసే కామెడీ చూపించారు. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది.