Actor Abhishek | టాలీవుడ్ నటుడు అభిషేక్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది. డ్రగ్స్ కేసులో తప్పించుకోని తిరుగుతున్న అభిషేక్‌ను గోవాలో యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. అభిషేక్ మీద ఎస్ఆర్ నగర్‌తో పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు డ్రగ్స్ కేసులు ఉన్నాయి. అయితే ఈ కేసులో కోర్టులకు హాజరు కాకుండా తప్పించుకోని తిరుగుతున్నాడు అభిషేక్, దీంతో కోర్టు అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇక అభిషేక్ ఎక్కడున్నాడా అని వెతుకుతున్న పోలీసులకు గోవాలో ఉన్నట్లు సమాచారం. అందింది. గోవాలో ఒక ప్రయివేట్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందగా.. అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
గోవాలో అరెస్టు చేసిన అతడిని పీటీ వారెంటు మీద హైదరాబాదు తీసుకొచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్- సిసిఎస్ కి తరలించి అక్కడ విచారణ జరుపుతున్నారు. అల్లరి నరేష్ నటించిన ‘డేంజర్’ సినిమాతో పాటు, ‘ఐతే’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘గగనం’, ‘నేను’, ‘కాళిదాస్’ వంటి సినిమాల్లో సహాయక నటుడి పాత్రల్లో మెరిశాడు అభిషేక్.