NTR30 Movie Story | ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తారక్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మొన్నటి వరకు రీజినల్ హీరోగా ఉన్న తారక్.. ఇప్పుడు పాన్ వరల్డ్ హీరోగా మారాడు. ఇప్పుడు ఆయన సినిమాలను మనదేశంలోనే కాదు పక్క దేశాల్లోనూ చూడ్డానికి సిద్ధంగా ఉన్నారు. తన బిజినెస్ వాల్యూ కూడా ముందటి కంటే మూడు రేట్లు ఎక్కువైంది. ఈ క్రమంలో తను చేయబోతే తదుపరి సినిమాపై పూర్తి దృష్టిని పెడుతున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివతో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. గతేడాది ప్రథమార్థంలోనే ఈ సినిమా ప్రకటన వచ్చినా ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేదు.
అయితే ఇటీవలే ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తారక్ ఈ మూవీ షూట్‌కు సంబంధించిన అప్డేట్ను తెలిపాడు. ఫిబ్రవరి నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిపి, మార్చిలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు వెల్లడించాడు. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా ఐలాండ్ & పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మూవీ సెమీ-పీరియడ్ సెటప్‌తో ఓ ఫిక్షనల్ ఐలాండ్‌లో జరుగుతుందని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.
ఇక ఈ సినిమా షూట్‌ను ముఖ్యంగా హైదరాబాద్, వైజాగ్, గోవాలో వేసిన సెట్స్‌లో జరుపునున్నారట. అలాగే ఈ చిత్రానికి భారీగా వీఎఫ్ఎక్స్ కూడా ఉంటుందట. ఇలా భారీ హంగులతో NTR30 రూపొందనుంది. ఈ సినిమాకు ‘దేవర’ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు టాక్. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్స్ట్, యువసుధ ఆర్స్ట్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్‌రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహించనుడటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.