యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి చేసిన జూనియర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమానికి హోస్ట్‌గా కూడా ఉన్నారు. మరి కొద్ది రోజులలో ఎన్టీఆర్ తన 30వ సినిమాని కూడా ప్రారంభించనున్నాడు. ఈ సినిమాని కొరాటల శివ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆచార్య సినిమా పనులతో బిజీగా ఉన్న కొరటాల శివ.. ఆ సినిమా పనులను త్వరగానే పూర్తి చేసుకొని.. ఎన్టీఆర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా రూపొందే ఈ సినిమాకు సంబంధించి ప్రతీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట కొరటాల. తాజాగా తారక్ మేకోవర్ కి సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కెరీర్లో ఎన్నో కొత్త లుక్స్ లో కనిపించి సందడి చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల సినిమా కోసం డిఫరెంట గెటప్‌లో కనిపించనున్నాడట.
గతంలో యమదొంగ ,కంత్రీ, టెంపర్ , అరవింద సమేత, జనతా గ్యారేజ్ వంటి చిత్రాలలో ఎన్టీఆర్ తన మేకొవర్తోనే ఆకట్టుకున్నాడు.ఇప్పుడు కొరటాల సినిమాలో చాలా స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్ తో కనిపిస్తాడట. లాంచింగ్ సమయానికి అలా మారాలని ఎన్టీఆర్ టార్గెట్‌గా పెట్టుకున్నాడని టాక్. చూడాలి ఇందులో ఎంత నిజం ఉందో మరి..!