NTR Neel | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ స్టార్ దర్శకుడు కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ (PrashanthNeel) కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. #NTRNeel అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను పుష్ప 2తో సూపర్ హిట్ అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. రుక్మిణి వసంత్ కథానాయికగా నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుందా ఎప్పుడు అప్డేట్లు వస్తాయా అని అటు అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ షూటింగ్‌కి సంబంధించి అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటినుంచి స్టార్ట్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరిగే ఈ షెడ్యూల్లో వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు, పోలీస్ అధికారుల పాత్రలతో ఓ భారీ యాక్షన్ సన్నివేశంతో చిత్రీకరణను ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్లో తారక్ పాల్గొనడం లేదని సమాచారం. మరోవైపు ఈ సినిమా టైటిల్ డ్రాగన్ అనే అనుకుంటున్నట్లు తెలుస్తుంది.