NTR | ఎటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “డ్రాగన్” అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది తెలుగు సినిమా స్థాయిని మరో లెవెల్‌కి తీసుకెళ్లే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా నిలవనుందని ఇప్పటికే నిర్మాతలు స్పష్టం చేశారు. రవి శంకర్ ఇటీవలే ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. ఎంత ఊహించుకున్నా దానికన్నా ఎక్కువగా ఉంటుంది అని పేర్కొనటంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ హార్డ్ వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు తారక్ లుక్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో బాగా సన్నబడిన ఎన్టీఆర్‌ని చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. అంతకుముందు కళ్యాణ్ రామ్ సినిమా “అర్జున్ సన్నాఫ్ వైజయంతి” ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించిన తారక్‌కి ఇప్పటి తారక్‌కి చాలా తేడా ఉంది. ఆయన మరింత సన్నగా మారడంతో అందరు స్టన్ అయిపోయారు. అయితే ఇలా మారడానికి కారణం డ్రాగన్ సినిమాలోని తన పాత్ర కోసమే అని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ సూచనల మేరకే తారక్ ఇలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారని ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి. సినిమా కథ 1960-70ల బెంగాల్ నేపథ్యంలో సాగనుందని, ఇందులో ఎన్టీఆర్ మాఫియా డాన్‌గా కనిపించనున్నారని సమాచారం. అప్పటి రాజకీయ పరిణామాలు, గ్యాంగ్ వార్స్ ఆధారంగా సినిమా సాగుతుందని టాక్.
అంతేకాక, చైనాలోని గోల్డెన్ ట్రయాంగిల్‌ను శాసించిన మాఫియా డాన్ జావో వీ జీవిత కథ ఆధారంగా కథను మలచినట్టు వినిపిస్తోంది.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్, బ్లాక్ బస్టర్ రేంజ్లో కథన శైలి ఈ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నాయి. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. “డ్రాగన్” 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం కోసం అభిమానులు చాలా క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. మరి తారక్ డ్రాగన్‌తో ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తాడో చూడాలి.