AAY Movie | ‘మ్యాడ్’ చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు ఎన్టీఆర్ బావమరిది, యువ హీరో నార్నే నితిన్. ఆయన తాజా చిత్రం ‘ఆయ్’ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. అంజి కె మణిపుత్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ సందర్భంగా శనివారం హీరో నార్నే నితిన్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ సంగతులివి..
అల్లు అరవింద్‌గారి సలహా మేరకు ఈ సినిమాకు ‘ఆయ్’ అనే టైటిల్ పెట్టాం. గోదావరి యాసలో ఆయ్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు. గోదావరి నేపథ్య కథ కాబట్టి టైటిల్ బాగా కుదిరింది. స్నేహం ప్రధానంగా ఈ కథ నడుస్తుంది. కుల, మతాలకు అతీతంగా మనందరినీ ముందుకు నడిపించే గొప్ప శక్తి స్నేహానిదే అనే సందేశంతో ఆకట్టుకుంటుంది. కావాల్సినంత వినోదంతో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉంటాయి.
ఎన్టీఆర్ బాగుందన్నాడు ఈ చిత్రంలో గోదావరి యాసలో మాట్లాడటం అంత ఇబ్బందిగా అనిపించలేదు. చిన్నతనం నుంచి గోదావరి ప్రాంతానికి చెందిన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండటం వల్ల ఆ యాసలో పర్ఫెక్ట్గా మాట్లాడగలిగాను. ఎన్టీఆర్‌గారు ట్రైలర్ చూసి బాగుందని అన్నారు. ఆయనకు కామెడీ బాగా నచ్చింది. సినిమా చూసిన తర్వాత కూడా ఆయన హ్యాపీగా ఫీలవుతారని అనుకుంటున్నా.
హండ్రెడ్ పర్సంట్ ఎఫర్ట్స్ కెరీర్‌పరంగా ప్రత్యేకంగా ఎలాంటి ప్రణాళికలు వేసుకోలేదు. నా మనసుకు నచ్చిన కథలతో సినిమాలు చేస్తున్నా. ఎలాంటి కథ అయినా హండ్రెడ్పర్సంట్ ఎఫర్ట్స్ పెట్టాలన్నదే నటుడిగా నా లక్ష్యం. ప్రస్తుతం ‘మ్యాడ్’ సీక్వెల్ షూటింగ్ జరుగుతున్నది. ఈ ఏడాదిలోనే రిలీజ్ ఉండొచ్చు. ప్రస్తుతానికైతే కొత్త ప్రాజెక్ట్‌లు అంగీకరించలేదు.