NTR | యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘దేవర: పార్ట్ 1’ చివరికి టెలివిజన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. గతేడాది సెప్టెంబరులో థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం, ఓటీటీలో సక్సెస్‌ఫుల్‌గా ట్రెండ్ అయినప్పటికీ ఇప్పటి వరకు బుల్లితెరపై ప్రసారం కాలేదు. ఇక ఇప్పుడైతే అభిమానుల ఎదురుచూపులకు తెర పడింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ‘దేవర’ టీవీలో ప్రసారంకానుంది. చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కులను Jio Star సంస్థ పొందింది. ఇందులో భాగంగా, వివిధ భాషల్లో ఉన్న ప్రముఖ టీవీ ఛానళ్లలో ఈ చిత్రం ప్రసారంకాబోతోంది.
తెలుగు: Star Maa, హిందీ: Star Gold, తమిళం: Vijay TV, ,కన్నడ: Star Suvarna, మలయాళం: Asianet లలో ఈ చిత్రం ప్రసారం కానుంది. అయితే తాజాగా హిందీ ప్రీమియర్ డేట్ అక్టోబర్ 26న అధికారికంగా ఖరారయ్యింది. మిగతా భాషల్లో టెలికాస్ట్ తేదీలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు దేవర చిత్రం టీవీలో ప్రసారం కాకపోవడానికి శాటిలైట్ రైట్స్‌పై చర్చలు, సరైన పండగ స్లాట్ కోసం వేచి ఉండటం, సాటిలైట్ డిమాండ్ తక్కువగా ఉండటంలాంటి అంశాలే ప్రధాన కారణాలుగా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం, థియేటర్లలో మంచి వసూళ్లు రాబట్టింది. తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) స్ట్రీమింగ్కి వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా హిట్‌గా నిలిచింది. ఇప్పుడు టెలివిజన్ ద్వారా మరింత మంది ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది.
ఈ చిత్రం ఫ్రాంచైజీగా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. కోరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథను ‘దేవర: పార్ట్ 2’ లో కొనసాగించనున్నారు. ప్రస్తుతం రెండో భాగం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘డ్రాగన్’ అనే చిత్రం పని చేస్తున్నారు. అది పూర్తయ్యాక ‘దేవర 2’ షూటింగ్ మొదలవుతుంది. ఎట్టకేలకు ఎన్టీఆర్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న బుల్లితెర ప్రీమియర్ రాబోతోంది. టీవీ ప్రీమియర్ ద్వారా దేవర 2కి సాలిడ్ ఫౌండేషన్ పడే అవకాశం ఉంది. ఈ టెలికాస్ట్ అభిమానులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.