Devara Movie | యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), కొరటాల శివ(Koratala Shiva) కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘దేవర'(Devara). ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విడుదల తేదీ వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా అవుతుంది.
ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు గాయం అయిన విషయం తెలిసిందే. దేవర షూటింగ్లో భాగంగా ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో పాల్గోన్న సైఫ్ కాలుకు బలమైన గాయం తగిలింది. దీంతో హుటా హుటిన ఆయన్ను హాస్పిటల్లోకి చేర్చారు దేవర టీమ్. అంతేకాదు సర్జరీ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో షూటింగ్‌కు ప్రస్తుతం ఆయన హాజరు కాలేకపోవచ్చట. దీంతో ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ సినిమా VFX వర్క్స్ కూడా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో దేవరను ఏప్రిల్ నుంచి ఆగష్టు లేదా సెప్టెంబర్ కి వాయిదా వేస్తున్నట్లు టాక్.
#DEVARA – Stands postponed. Film is likely to be released either in August or September. pic.twitter.com/Bjkkb1RkAq
— Aakashavaani (@TheAakashavaani) January 23, 2024