అందరికి అర్ధమయ్యే పదాలతో తెలుగు సినీ ప్రియులని ఎంతగానో అలరించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్తమయం అయ్యారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. మరి కొద్ది క్షణాలలో సిరివెన్నెల అంత్యక్రియలు జరగనుండగా, ఆయనను కడసారి చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు, రానా , నాగార్జున, వెంకటేష్, ఇలా మరెందరో సినిమా తారలు సిరివెన్నెలకు నివాళులు అర్పించారు.
పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కడసారి చూసేందుకు వచ్చారు. సిరివెన్నెల నిర్జీవంగా ఉండటాన్ని చూసి బరువెక్కిన హృదయంతో నివాళులు అర్పించారు. కొన్ని కొన్ని సార్లు మన ఆవేదనను, భాదను వ్యక్తపరచడానికి మాటలు రావు అని ఎన్టీఆర్ అన్నారు. ఈ ఆవేదనను ఆయన తన కలంతోనే వ్యక్తపరిస్తే బావుండేదని తారక్ ఎమోషనల్ అయ్యారు. సీతారామ శాస్త్రి గారి కలం ఆగిన..ఆయన రాసిన ఎన్నో అద్భుతమైన పాటలు, అక్షరాలు, తెలుగు జాతి, తెలుగు భాష బ్రతికున్నంతకాలం చిరస్మరణీయంగా ఆ సాహిత్యం మిగిలిపోతుంది అని చెప్పుకొచ్చారు.
#PawanKalyan @PawanKalyan pays tribute to #SirivennelaSeetharamaSastry Garu#RipSirivennelaSeetharamaSastry pic.twitter.com/zS9NOVZbi5
— BA Raju's Team (@baraju_SuperHit) December 1, 2021