దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో పీరియడికల్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు ప్రాంతానికి చెందిన చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు కలిస్తే.. వాళ్లిద్దరి మధ్య దోస్తీ ఎలా కుదిరింది? వాళ్ల దోస్తీ చివరికి ఎటువైపునకు దారి తీసింది? వంటి ఆసక్తికర కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు జక్కన్న.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఉక్రెయిన్‌లో జరుగుతుంది. రెండు పాటలకు సంబంధించిన షూటింగ్ కోసం టీం ఉక్రెయిన్‌కి వెళ్లగా, షూటింగ్ గ్యాప్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ చిల్ అవుతున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. దీనిని రాజమౌళి డమ్మీ కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. మూవీ ప్రమోషన్లో భాగంగా విడుదలైన ఈ వీడియో నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఈ వీడియోను ఆర్ఆర్ఆర్ టీమ్ సోషల్ మీడియాలో పంచుకోగా, అందులో ఎన్టీఆర్ మొహంపై గాయం అయినట్లు కనిపిస్తోంది. దీంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.అయితే అది చిత్ర షూటింగ్ కోసం అలా చిన్న మార్క్‌ని పెట్టినట్టు టాక్. ఏదేమైన ఈ వీడియోలో ఎన్టీఆర్ గాయంపైనే అందరి ఫోకస్ ఉంది . చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా అజయ్ దేవగన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
. @AlwaysRamCharan @tarak9999 & @ssrajamouli chilling in-between shots!! ❤️ #RRRMovie pic.twitter.com/IoKTaiAQ9r
— RRR Movie (@RRRMovie) August 7, 2021