Ntr-Jayasudha| విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. అలానే ఎంతో మంది హీరోయిన్స్‌తో కలిసి నటించారు. ఆయనతో నటించిన వారిలో జయప్రద,శ్రీదేవి, జయసుధ వంటి వారు ఉన్నారు. అయితే జయసుధ, ఎన్టీఆర్ కాంబినేషన్లో చాలా సినిమాలే వచ్చాయి.`అనురాగ దేవత`, `డ్రైవర్ రాముడు`, `గజదొంగ`, `సింహం నవ్వింది`, `అడవి రాముడు`, `యుగంధర్`, `శ్రీనాథ కవి సర్వభౌముడు`, `కేడీ నెం 1`, `లాయర్ విశ్వనాథ్`, `మహాపురుషుడు`, `సరదా రాముడు` వంటి సినిమాలు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చాయి.
అయితే ఓ సారి జయసుధ విషయంలో ఎన్టీఆర్ చాల విసిగిపోయాడట. దాంతో ఫుల్ సీరియస్ అవుతూ.. సినిమాలన్నా మానేయ్, లేదంటే ఆ మాట చెప్పడమన్నా మానేయ్ అని అన్నాడట.దాంతో ఈ భామ గాడిలో పడింది. మరి జయసుధకి ఎన్టీఆర్ ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అంటే.. జయసుధకి ఓ దశలో ఇక సినిమాలు చాలు, మానేయాలనుని అనుకుందట. ఒప్పుకున్న సినిమాలు చేసి ఇక చేయను పదే పదే చెప్పేదట. మంచి మంచి ఆఫర్స్ వస్తున్నా కూడా ఆమె చేయనని చెబుతూ ఉండేదట. షూటింగ్ సెట్లో కూడా హీరోలతో ఇదే మాట పదే పదే రిపీట్ చేసేసరికి ఎన్నో సార్లు విన్న ఎన్టీఆర్‌కి పిచ్చెక్కిపోయింది.
దాంతో రామారావు ఆమెపై ఫైర్ అయ్యాడు. ఫస్ట్ నువ్వు సినిమాలన్నా మానేయ్, లేదంటే నేను సినిమాలు మానేస్తా` అని చెప్పడం అయినా మానేయ్, ఏదో ఒకటి ఫస్ట్ చేయ్ అని సీరియస్ అయ్యాడట. అప్పటి వరకు అందరితో ఆ మాట చెప్పుకుంటూ వచ్చిన జయసుధ అప్పటి నుండి చెప్పడం మానేసిందట. తనకు వచ్చిన ఆఫర్స్ వినియోగించుకుంటూ సినిమాలు చేసింది. దాదాపు ఐదు దశాబ్దాలుగా నటిస్తున్న జయసుధ ఇప్పటి వరకు 300లకుపైగా సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ సినిమాలు చేసిన జయసుధ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించింది.