NTR | స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ తనకి వర్క్ పట్ల ఉన్న డెడికేషన్ & కమిట్మెంట్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రూవ్ చేశారు. తాజాగా ఓ కమర్షియల్ యాడ్ షూట్ సందర్భంగా ఆయన గాయపడ్డా, మరుసటి రోజే షూటింగ్లో పాల్గొని ఆ యాడ్‌ను పూర్తి చేశారు. ఇటీవల ఎన్టీఆర్ ఆఫీస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఎన్టీఆర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. వైద్యులు కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించినా, నిర్మాతలకు నష్టం కలగకూడదనే ఆలోచనతో ఎన్టీఆర్ తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో యాడ్ షూట్ కోసం భారీ సెట్స్ వేశారు.
ఎన్టీఆర్ రికవరీ అయ్యే వరకు షూటింగ్ వాయిదా వేస్తే స్టూడియో రెంట్ పెరుగుతుందని తెలుసుకున్న ఆయన, గాయాల నొప్పిని తట్టుకుని షూటింగ్‌కు హాజరయ్యారు. చివరికి షూట్ పూర్తి చేసి యూనిట్ సభ్యులందరినీ ఇంప్రెస్ చేశారు. ఎన్టీఆర్ చూపిన ఈ ప్రొఫెషనలిజం చూసి యాడ్ ఫిల్మ్ మేకర్స్, టీమ్ మెంబర్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, ఈ మూవీకి డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) టైటిల్ పరిశీలిస్తున్నారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ సినిమా తాజా షెడ్యూల్‌ను ఎన్టీఆర్ ప్రారంభించనున్నారు.
అదేవిధంగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 , అలాగే మరికొన్ని పెద్ద సినిమాలు చర్చల్లో ఉన్నట్లు సమాచారం. మొత్తానికి గాయాల బాధని లెక్క చేయకుండా వర్క్‌కి ప్రాధాన్యతనిచ్చిన ఎన్టీఆర్ ఆయనను ఎందుకు “మ్యాన్ ఆఫ్ మాసెస్” అంటారో మరోసారి నిరూపించారు.కాగా, చివరిగా ఎన్టీఆర్ దేవర చిత్రంతో పలకరించారు. ఈ చిత్రం ఓ మోస్తరు విజయం సాధించిన ప్రేక్షకులకి అనుకున్నంత కిక్ ఇవ్వలేదు. అందుకే ప్రశాంత్ నీల్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమాతో ఎన్టీఆర్ భారీ హిట్ కొట్టడం ఖాయం అని ఫిక్స్ అయ్యారు.