ఎన్టీఆర్ 30వ సినిమా సన్నాహాలు మొదలయ్యాయి. గతంలో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్తుందా అని సినీ ప్రియులు ఎదురుచూశారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. దర్శకుడు కొరటాల పూర్వ నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్‌గా కనిపిస్తారని, విద్యార్థి జీవితం చుట్టూ అల్లుకున్న రాజకీయాల నేపథ్యంతో కథ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రంలో నాయికను ఎంపిక చేయాల్సి ఉంది. మొదట ఆలియాను హీరోయిన్గా నిర్ణయించుకున్నా, ప్రెగ్నెన్సీ వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ వదులుకోవాల్సి వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.