Court | ఈ మధ్య కాలంలో మంచి హిట్ సాధించిన సినిమాలలో కోర్టు చిత్రం ఒకటి.ఇందులో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. హర్ష్ రోహణ్, శ్రీదేవి, శివాజీ కీలకపాత్రలు పోషించారు. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని నాని సమర్పించారు. ఇందులో శివాజీ, ప్రియదర్శి అద్భుతమైన నటన విమర్శకుల ప్రశంసలు లభించాయి .మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతోపాటు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు కూడా రాబట్టింది.విడుదలైన 3 వారాల్లోనే రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
కంటెంట్ ఉంటే చాలు.. ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి రుజువైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది.ఈ సినిమాను ఏప్రిల్ 11న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నారట. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. కోర్ట్ సినిమా థియేటర్లలో తెలుగు భాషలోనే రిలీజ్ కాగా.. ఇప్పుడు ఓటీటీలో మాత్రం ఏకంగా ఐదు భాషలలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అందుబాటులో ఉంటుంది.
ఇక ఈ చిత్రం లవ్ స్టోరీ, పోక్సో కేసు చుట్టూ తిరుగుతుంది.ఆడియన్స్ అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈసినిమా దాదాపు రూ.57 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రానికి ప్రశాంతి త్రిపురనేని, దీప్తి గంటా నిర్మాతలుగా వ్యవహరించారు.ఈ చిత్రంలోని సాంగ్స్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేమలో అనే సాంగ్‌కి ఎంతో మంది రీల్స్ చేశారు. నాని కూడా ఈ పాటకి ఓ ఈవెంట్లో డ్యాన్స్ చేయడంతో బాగా బజ్ వచ్చింది.