OG Movie | పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతినివ్వగా.. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఓజీ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోల కోసం చిత్రబృందం తెలంగాణ ప్రభుత్వం ముందు అభ్యర్థనను నిలుపగా.. బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం అనుమతినిచ్చింది. బెనిఫిట్ షోలకు రూ.800 వరకు పెంచుకునేందుకు అనుమతినివ్వడంతో పాటు విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు టికెట్ ధరలను సింగిల్ స్కీన్లలో రూ.100లతో పాటు మల్టీప్లెక్స్‌లలో రూ.150 పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉత్తర్వులను హైకోర్టు తాజాగా రద్దు చేసింది.