Director Krishna Vamsi | నా సినిమాలకు సీక్వెల్స్ లేవంటున్న క్రియేటివ్ దర్శకుడు
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాకు సీక్వెల్ ఉంటుందా? అని ఇటీవల సోషల్ మీడియాలో కృష్ణవంశీని అడగగా కృష్ణ వంశీ లేదు అని సమాధానం ఇచ్చారు.
సృజనాత్మక దర్శకుడిగా పేరుతెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ ఆయన సినిమాల్లో వాణిజ్య అంశాలతో పాటు సామాజికి ప్రయోజాలను కూడా జోడిస్తాడు. గులాబీ, సింధూరం, అంతఃపురం, నిన్నేపెళ్ళాడుతా, మురారి, ఖడ్గం, రాఖీ, చందమామ వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించారు కృష్ణవంశీ. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీఫీల్ గుడ్ ఫ్యామిలి ఎంటర్ టైనర్లు గానే జనాదరణ పొందాయి. అయితే ఈ మధ్య కాలంలో కృష్ణవంశీ దర్శకత్వాన్నికి దూరంగా వుంటున్నాడు ఆయన ఇప్పుడున్న రేస్ లో వెనకబడ్డారనే చెప్పొచ్చు.
ఇటీవల కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సినిమా రంగ మార్తాండ. ఈ సినిమా లో ప్రకాశ్ రాజ్, జయసుధ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అయితే ఈయన దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాకు సీక్వెల్ ఉంటుందా? అని ఇటీవల సోషల్ మీడియాలో కృష్ణవంశీని అడగగా కృష్ణ వంశీ లేదు అని సమాధానం ఇచ్చారు. కాజల్ అగర్వాల్, నవదీప్, శివ బాలాజీ, నాగబాబు, తదితరులు ప్రధాన పాత్రలుగా నటించిన చిత్రం చందమామ.
ఈ సినిమా ప్రేక్షకులందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ ని రూపొందిస్తారా అని అడిగిన ప్రశ్నకు కృష్ణవంశీ తాను తీసిన సినిమాలకు ఏ సినిమాలకు సీక్వెల్స్ వుండవని పేర్కొన్నారు. అసలు నాకు సీక్వెల్ లు అర్థంకావని ఏ సినిమాను సీక్వెల్ గా చేయడానికి ఆసక్తి లేదని ఆయన అన్నారు. సో కృష్ణవంశీ సినిమాలకు ఏదీ సీక్వెల్ లేదని తేల్చి చెప్పారు.
Read Also :
Mr Bachchan Movie | ‘మిస్టర్ బచ్చన్’ రీమేక్ అన్న నెటిజన్.. సాలిడ్ కౌంటర్ ఇచ్చిన హరీశ్ శంకర్
August 15 Movies | ఆగస్టు 15న సినిమాల జాతర..! ఏమేం రిలీజు అవుతున్నాయంటే?
Dhanush – Jr NTR | ఎన్టీఆర్‌తో కలిసి మల్టీ స్టారర్ చేయాలని ఉంది : ధనుష్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

