OG Movie | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘OG’ మరో వారం రోజుల్లో థియేటర్లలో సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా.. డీవీవీ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నాడు. భారీ అంచనాల మీద వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకు విడుదలకు ముందు ప్రీమియర్ షోలు ఉండవని తెలుస్తుంది. ఈ మేరకు వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
సాధారణంగా పెద్ద సినిమాలకు రిలీజ్‌కు ఒక రోజు ముందు ప్రీమియర్ షోలు ప్రదర్శించడం పరిపాటి. అయితే పుష్ప 2 ఘటన తర్వాత ఆ పరిస్థితి మొత్తం మారిపోయింది. ప్రభుత్వం కూడా ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వకపోవడతో ఫ్యాన్స్ కూడా విడుదల రోజే సినిమాను చూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాకు అయిన ప్రీమియర్స్ పడతాయి అనుకుంటే తెలంగాణలో అది జరిగేలా లేదని తెలుస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుండగా.. ఉదయం 6 గంటల నుంచి షోలకి అనుమతి ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించాల్సి ఉంది.