షారుఖ్‌ఖాన్ నటించిన కొత్త సినిమా ‘పఠాన్’ను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ సాగుతున్నది. ఈ చిత్రం నుంచి ఇటీవల ‘బేషరమ్ రంగ్..’ పాట విడుదలైనప్పటి నుంచి ఈ వివాదం మొదలైంది. ఈ పాటలో దీపికా పడుకోన్ వేసుకున్న దుస్తులు, పాటను చిత్రీకరించిన విధానం అసభ్యంగా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి.
‘పఠాన్’ బాయ్‌కాట్ ట్రెండ్‌పై స్పందించారు షారుఖ్. ఆయన మాట్లాడుతూ…‘సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం పెరిగింది. అది సినిమాను ప్రభావం చేస్తుందని కొందరి నమ్మకం. ఇలాంటి సమయంలోనే సినిమా తన పాత్రను మరింత బలంగా పోషించాలి. కొందరి కురచ మేథస్సుకు సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ట్రెండ్స్ అద్దం పడుతుంటాయి. దేనినైనా విమర్శించడం, విధ్వంసం చేయడమే వారికి తెలుసు. ఇలాంటి చర్యల వల్ల నాకేం ఇబ్బంది లేదు. నాకే కాదు ప్రపంచానికి ఏ సమస్యా లేదు. బాయ్ కాట్ ట్రెండ్స్ ఎన్ని వచ్చినా మనమంతా జీవించే ఉంటాం’ అన్నారు. యష్ రాజ్ ఫిలింస్ పతాకంపై దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ రూపొందించిన ‘పఠాన్’ సినిమా వచ్చే జనవరి 25న విడుదల కానుంది.