Shakini Dakini Movie Teaser | ‘స్వామిరారా’ సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ వర్మ. మొదటి సినిమాతో ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ‘దోచెయ్’, ‘కేశవ’, ‘రణరంగం’ వంటి సినిమాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన రవితేజతో ‘రావణసుర’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈయన ఇదివరకే దర్శకత్వం వహించిన లేడీ మల్టీస్టారర్ ‘శాకిని-డాకిని’ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. దక్షిణ కొరియా చిత్రం ‘మిడ్ నైట్ రన్నర్’కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నివేథా థామస్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో నటించారు. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 16న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
‘అకాడమీలో ట్రైనింగ్ స్ట్రిక్ట్‌గా ఉంటుందని, చాలా టఫ్‌గా ఉంటుందని మీరందరూ వినే ఉంటారు. అది 100శాతం కరెక్టు’ అంటూ టీజర్ ప్రారంభమైంది. నివేథా, రెజీనా ఇద్దరూ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకుంటుంటారు. ఈ ఇద్దరికి ఒకరికొకరంటే పడనట్టు టీజర్ చేస్తే తెలుస్తుంది. టీజర్ మొత్తం ఫన్‌తో ఆకట్టుకుంటుంది. మధ్యలో క్రైమ్ సీన్.. నివేథా, రెజీనా యాక్షన్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. టీజర్ చివర్లో ‘డాకిని తెలుసా నీకు కరెక్టు టైం చూసి రక్తం తాగుతుంటది’. ‘మరి నువ్వేంటి శాకినివా’ అనే డైలాగ్స్ హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.