Paruvu Web Series | ఈ మధ్య టాలీవుడ్ నటులు సినిమా ప్రమోషన్స్‌ను కొత్తగా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న నభా నటేష్, ప్రియదర్శి ‘డార్లింగ్’ (Darling) అనే సినిమా ప్రమోషన్స్ కోసం గొడవ పడినట్లు నటించగా.. తాజాగా మరో నటి ఇలానే చేసింది. టాలీవుడ్ బ్యూటీ నివేదా పేతురాజ్(Nivetha Pethuraj)కు సంబంధించి గురువారం ఒక వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. కారులో వెళుతున్న నివేదా పేతురాజ్‌ను పోలీసులు ఆపి మేడం.. ఎలక్షన్ కోడ్ నడుస్తోంది. మేము మీ కారును చెక్ చేయాలని అనుకుంటున్నాం. ఒకసారి డిక్కీని ఓపెన్ చేయండి అని అనడంతో నివేదా కోపంతో ఊగిపోతూ పోలీసులపై అరిచింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు నివేదా డిక్కీలో ఏం దాచింది అంటూ కామెంట్స్ చేయగా మరికొందరు ఇది సినిమా స్టంట్ అని.. ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన స్క్రిప్ట్ వీడియో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోపై తాజాగా క్లారిటీ ఇచ్చింది నివేదా పేతురాజ్.
అందరూ అనుకున్నట్లుగానే ఇది సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చేసినట్లు నివేదా ప్రకటించింది. నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ పరువు(Paruvu). ఈ సిరీస్‌కు సిద్దార్థ్ – రాజశేఖర్ సంయక్తంగా దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో నేరుగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు ప్రీమియర్ తేదీని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సిరీస్‌ను జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 వెల్లడించింది. ఇక పరువు ఫస్ట్ లుక్ పోస్టర్ గమనిస్తే.. నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య అనుకోకుండా మర్డర్ కేసులో ఇరుక్కొని ఒక బాడీని డిక్కీలో దాచుతున్నట్లుగా పోస్టర్ ఉంది. ఇక క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సిరీస్‌లో నాగబాబు కీలక పాత్ర పోషిస్తుండగా.. గోల్డెన్ బాక్స్ ఎంటర్టైనమెంట్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల నిర్మిస్తుంది.
The story behind the viral video is revealed! @ZEE5Telugu ’s next original series “#Paruvu” hits screens on June 14 and the poster hints at an intriguing thriller ride.#ParuvuOnZee5 pic.twitter.com/W3xevSbcvr
— Vamsi Kaka (@vamsikaka) May 31, 2024